రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ( ఆర్.యఫ్.ఆర్.ఐ ) నుండి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్

రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ( ఆర్.యఫ్.ఆర్.ఐ ) నుండి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. మల్టి టాస్కింగ్ స్టాఫ్,టెక్నీషియన్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వార భర్తీ చేస్తున్నారు. ఐ.టి.ఐ /10వ తరగతి / డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావున ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్ధులిద్దరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు,ఆశక్తి మరియు అర్హత కల్గిన అభ్యర్ధులు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదివి అప్లై చేసులోగలరు.

 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : 21-10-2019
దరఖాస్తు చేయుటకు ఆఖరు తేది : 16-11-2019

పోస్టుల సంఖ్య : 23

పోస్టుల వివరాలు :

మల్టి టాస్కింగ్ స్టాఫ్ – 12 పోస్టులు
టెక్నీషియన్ – 03 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ – 08 పోస్టులు

అర్హతలు :

మల్టి టాస్కింగ్ స్టాఫ్ : 18-27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
టెక్నీషియన్ : 18-30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్ : 21 -30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
OBC అభ్యర్ధులకు 3 సంవత్సరాలు
SC / ST అభ్యర్ధులకు 5 సంవత్సరాలు
PwBD / మాజీ సైనికోద్యోగులకు 10 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

మల్టి టాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి + 3సం అనుభవం
టెక్నీషియన్ – 10వ తరగతి + సంబంధిత విభాగంలో ఐ.టి.ఐ పూర్తీ చేసి ఉండాలి.
టెక్నికల్ అసిస్టెంట్ – డిగ్రీ

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్

అభ్యర్ధులు క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫార్మను డౌన్లోడ్ చేసుకోని సరైన సమాచారంతో నింపి కింద ఇవ్వబడిన చిరునామా పై పంపగలరు.

అప్లికేషన్ ఫీజుల వివరాలు :

SC / ST / PH అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
UR / OBC అభ్యర్ధులు 200 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ఎంపిక విధానం :

వ్రాత పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు.

ముఖ్యమైన లింకులు :

నోటిఫికేషన్ వివరాలు

Leave a Comment