ఆంధ్రప్రదేశ్ మహిళ,శిశు సంక్షేమ అభివృద్ది మంత్రిత్వ శాఖ నుండి అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ మహిళ,శిశు సంక్షేమ అభివృద్ది మంత్రిత్వ శాఖ నుండి అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఏ.పి అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్ 2019 పేరుతో అనంతపురం జిల్లాలోని వివిధ ఐ. సి.డి.యస్ ప్రోజెక్టుల పరిధిలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు,సహాయకులు పోస్టులు ఇందులో ఖాళీగా ఉన్నట్లు ఐ.సి.డి.యస్ పి.డి చిన్నా దేవి గారు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 727 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

జాబ్ లొకేషన్ : ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ఆఖరి తేదీ : Coming Soon
ఇంటర్వ్యూ జరుగు తేదీ : updated soon

పోస్టుల సంఖ్య : 727

ఖాళీల వివరాలు :

1. అంగన్వాడీ కార్యకర్త పోస్టు – 154
2. అంగన్వాడీ ఆయాలు – 58
3. మినీ అంగన్వాడీ కార్యకర్తలు – 515

అర్హతలు :

వయస్సు :

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 21 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి,అలా 21 సంవత్సరాలు లేని పక్షాన 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారిని పరిగణలోకి తీసుకుంటారు.

విద్యార్హతలు :

అంగన్వాడి కార్యకర్త :

ఈ పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్ధులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త :

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్ధులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం :

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ ఖాళీల భర్తీ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మంచి పే స్కేల్ లభిస్తుంది

దరఖాస్తు చేయు విధానం : ఆఫ్ లైన్

1. దరఖాస్తులను ఆయా సిడిపియస్ లేదా ఐటీడీఏ కార్యాలయాల నుండి పొందాలి.
2. ఎటువంటి దిద్దుబాటులు లేకుండా మీ వివరాలను అప్లికేషన్‌లో పూరించండి.
3. మార్క్స్ మెమోలు మరియు తగు పత్రాల జిరాక్స్ కాపీలను జత చేయండి.
4. ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో కవర్ పై భాగంలో పోస్టు పేరును రాయండి.
5. చివరగా, ఇచ్చిన పోస్టల్ చిరునామాకు చివరి తేదీకి ముందే పంపండి.

అప్లికేషన్ ఫి వివరాలు :

ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవటానికి, అభ్యర్థులు వారి క్యాటగిరీ మీద ఆధారపడి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. వీటికి సంబంధించిన వివరాలు త్వరలోనే నవీకరించబడతాయి.

ఎంపిక విధానం :

ఎటువంటి రాతపరీక్ష లేదు,కేవలం ఇంటర్వ్యూ ( మెరిట్ ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ) ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన లింకులు :

అఫిషల్ వెబ్సైట్

2 thoughts on “ఆంధ్రప్రదేశ్ మహిళ,శిశు సంక్షేమ అభివృద్ది మంత్రిత్వ శాఖ నుండి అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ”

Leave a Comment